News August 4, 2024
వచ్చేవారం నుంచి వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియ: డీఈఓ

వచ్చేవారం నుంచి ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతుందని డీఈఓ శామ్యూల్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో త్వరలోనే పాఠశాల విద్యాశాఖ కమిషనర్, కార్యదర్శి పర్యటనలు ఉంటాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా నివేదికలను సిద్ధం చేసుకోవాలని కోరారు. ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు.
Similar News
News January 28, 2026
రెండో రోజు కొనసాగిన ఇంటర్ ప్రాక్టికల్స్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2వ రోజు ఇంటర్మీడియట్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగాయి. పరీక్షల వివరాలను బుధవారం ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 1,313 మందికి గాను 1,239 మంది హాజరవ్వగా.. 74 మంది గైర్హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరంలో 1,081 మందికి గాను 1,064 మంది పరీక్ష రాశారని, 17 మంది హాజరు కాలేదని పేర్కొన్నారు.
News January 28, 2026
100 రోజుల కార్యాచరణ అమలు కావాల్సిందే: కలెక్టర్

100 రోజుల కార్యాచరణ తప్పనిసరిగా ప్రతీ పాఠశాలలో జరగాల్సిందేనని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. బుధవారం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదోని డివిజన్ ఎంఈఓలు, హెచ్ఎంలతో 10వ తరగతికి సంబంధించిన 100 రోజుల కార్యాచరణ అమలుపై డివిజన్ స్థాయి సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల ప్రత్యేక అధికారులు విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారిని ప్రోత్సహించాలన్నారు.
News January 28, 2026
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆకాంక్షించారు. బుధవారం కోడుమూరు మండలం వర్కూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయంలో మౌలిక వసతులు, విద్యా బోధనను పరిశీలించిన కలెక్టర్, పరీక్షల సంసిద్ధతపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మంచి దస్తూరి (హ్యాండ్ రైటింగ్) అలవరుచుకోవాలని సూచిస్తూ వారిలో స్ఫూర్తి నింపారు.


