News August 4, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 16, 2026

మీరు పాలించడానికి అర్హులేనా?: జగన్

image

AP: గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో YSRCP కార్యకర్త మందా సాల్మన్‌ హత్యకు TDP వర్గీయులే కారణమని మాజీ CM జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ‘రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు? మీరు పాలించడానికి అర్హులేనా?’ అంటూ CM చంద్రబాబును ప్రశ్నించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారని, అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి వచ్చిన వ్యక్తిని కిరాతకంగా చంపడం దుర్మార్గమని మండిపడ్డారు.

News January 16, 2026

స్పీకర్‌కు ఇదే చివరి అవకాశం: సుప్రీంకోర్టు

image

TG: BRS MLAల పార్టీ ఫిరాయింపు కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్‌కు ఇదే చివరి అవకాశమని వ్యాఖ్యానించింది. ‘ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు ఉంటాయి. మిగిలిన ముగ్గురు MLAలపై నిర్ణయం తీసుకోండి’ అని ఆదేశించింది. ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు స్పీకర్ 4 వారాల టైమ్ కోరగా 2 వారాల్లో ప్రగతి చూపిస్తే 4 వారాల సమయం ఇస్తామని SC తెలిపింది.

News January 16, 2026

సొంతింటి ‘బడ్జెట్’కు నిర్మలమ్మ బూస్ట్?

image

వచ్చే బడ్జెట్‌లో ‘అఫర్డబుల్ హౌసింగ్’కు ఊపిరిపోయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ₹45 లక్షల ధర పరిమితిని ₹75 లక్షల నుంచి ₹95 లక్షల వరకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నా సామాన్యుడికి ఇల్లు భారమవుతోందని.. పన్ను రాయితీలు, అద్దె గృహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హోమ్ లోన్ వడ్డీ మినహాయింపును ₹5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.