News August 4, 2024
రాయన్ మూవీ కలెక్షన్లు ఎంతంటే?
ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూళ్లు చేసింది. ఒక్క భారత్‌లోనే రూ.72.75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. గతంలో ధనుష్ నటించిన ‘తిరు’, ‘సార్’ సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి. ప్రస్తుతం రాయన్ ఇదే జోరును కొనసాగిస్తే ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచే అవకాశముంది.
Similar News
News January 15, 2025
‘డాకు మహారాజ్’ 10 లక్షల టికెట్స్ సోల్డ్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా అదరగొడుతోంది. బుక్ మై షోలో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 1 మిలియన్ టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బాక్సాఫీస్ దబిడి దిబిడి’ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేటితో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.
News January 15, 2025
BREAKING: చంద్రబాబుకు భారీ ఊరట
AP: సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఈ కేసులో 2023 నవంబర్‌లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం SCని ఆశ్రయించింది.
News January 15, 2025
గేమ్ ఛేంజర్ NETT కలెక్షన్స్ ఎంతంటే?
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా 5 రోజుల్లో ₹100కోట్ల NETT కలెక్షన్స్ సాధించినట్లు ఇండియా టుడే తెలిపింది. తొలి రోజు ₹51కోట్లు, తర్వాతి 4 రోజుల్లో వరుసగా ₹21.6కోట్లు, ₹15.9కోట్లు, ₹7.65కోట్లు, ₹10 కోట్లు వసూలు చేసిందని పేర్కొంది. మొత్తం <<15125676>>NETT<<>> వసూళ్లు ₹106.15 అని పేర్కొంది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 10న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.