News August 4, 2024
ఒలింపిక్స్: లక్ష్యసేన్, లవ్లీనా ఏం చేస్తారో?

ఇవాళ పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీస్‌లో భారత ప్లేయర్ లక్ష్యసేన్ డెన్మార్క్ ప్లేయర్ విక్టర్‌తో తలపడనున్నారు. ఇందులో గెలిస్తే సరికొత్త చరిత్ర నమోదవ్వడమే కాకుండా భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది. ఓడితే కాంస్యం కోసం పోరాడాల్సి ఉంటుంది. మరోవైపు హాకీలో భారత్, బ్రిటన్ క్వార్టర్ ఫైనల్లో తలపడున్నాయి. మహిళల బాక్సింగ్ QFలో లవ్లీనా బరిలో ఉంది. పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి.
Similar News
News March 28, 2026
విజయవాడ రాజధానిగా ఉంటే ఊహకందని అభివృద్ధి జరిగేది: CM

AP: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు రావని CM CBN తెలిపారు. ‘శాతవాహనులు అమరావతి నుంచే పాలించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రాజధానిగా విజయవాడ ఉంటే అభివృద్ధి ఊహకందని విధంగా ఉండేది. ఆనాటి రాజకీయ పరిస్థితుల వల్ల అది సాధ్యం కాలేదు. తెలుగు జాతి కోసం HYDను అభివృద్ధి చేశాం. ఇప్పుడు తెలంగాణకు 75% ఆదాయం HYD నుంచే వస్తోంది’ అని అసెంబ్లీలో రాజధానిపై తీర్మానం సందర్భంగా వ్యాఖ్యానించారు.
News March 28, 2026
‘సవాలక్ష’ అంటే ఏమిటి?

ఎక్కువ కష్టాలు, పనులు, సమస్యకు అనేక కారణాలున్నాయని చెప్పేందుకు ‘సవాలక్ష’ వాడతారు. ఈ పదానికి పలు రకాల విశ్లేషణలున్నాయి. భారతంలో లక్ష శ్లోకాలు ఉంటాయి. దానికి అనుబంధంగా ఉండే హరివంశంలో 24వేల శ్లోకాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి సవాలక్ష అంటారని పండితులు చెబుతున్నారు. అలాగే ‘సవా’ అంటే ఉర్దూలో పావు(1/4) అని అర్థం. దీనిబట్టి సవాలక్ష అంటే 1,25,000 అని భాషా పండితులు చెబుతుంటారు.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 28, 2026
ఈ వింత చట్టాల గురించి తెలుసా?

*సింగపూర్‌లో 1992 నుంచి చూయింగ్ గమ్ వాడటం, దిగుమతి చేయడంపై నిషేధం
*జర్మనీలో పెట్రోల్ అయిపోయి రోడ్డుపై వాహనం ఆగిపోయినా నేరమే. డ్రైవర్ ముందే జాగ్రత్త పడాలి
*జపాన్‌లో అధిక బరువు ఉండటం చట్టవిరుద్ధం. కంపెనీలు తమ ఉద్యోగుల నడుము కొలతలను ఏటా చెక్ చేస్తాయి. కొలత ఎక్కువగా ఉంటే డైట్ పాటించాలి.
*థాయ్‌లాండ్‌లో డబ్బును తొక్కితే జైలు శిక్ష తప్పదు. కరెన్సీ నోట్లపై రాజు ముఖం ఉండటమే దీనికి కారణం


