News August 4, 2024

తెరపైకి ‘డార్క్ టూరిజం’

image

కేరళలో ప్రకృతి విపత్తుతో ‘డార్క్ టూరిజం’ తెరపైకి వచ్చింది. దీనర్థం విషాదకర సంఘటనలు, విపత్తులు, మరణాలు జరిగిన ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు/ప్రజలు రావడమే. దీనిని గ్రీఫ్ లేదా బ్లాక్ టూరిజమని పిలుస్తుంటారు. విపత్తుల వల్ల కలిగిన ప్రభావాలను చూసేందుకు కొందరు వెళ్తే, మరికొందరు మరణించిన వారికి నివాళులు ఇచ్చేందుకు, ఇంకొందరు సంఘటనల గురించి తెలుసుకోవడానికి వెళ్తుంటారు.

Similar News

News March 25, 2026

లాస్ట్ మినిట్ డుమ్మాతో టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది: గంగూలీ

image

టీమ్ ఇండియా కంటే IPL టీమ్‌ను నిర్మించడమే కష్టమని గంగూలీ అన్నారు. ‘భారత జట్టుకైతే బెస్ట్ ప్లేయర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కానీ IPLలో ప్లేయర్స్ 10 టీమ్స్‌కు డిస్ట్రిబ్యూట్ అవుతారు. ఇలాంటి టైమ్‌లో క్వాలిటీ ప్లేయర్స్ లాస్ట్ మినిట్‌లో రాకపోతే టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది’ అని గంగూలీ అన్నారు. మిచెల్ స్టార్క్ రాకపై సస్పెన్స్ నెలకొన్న తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్‌గా ఈ కామెంట్స్ చేశారు.

News March 25, 2026

మార్చి 25: చరిత్రలో ఈరోజు

image

1655: శని గ్రహ అతిపెద్ద ఉపగ్రహం టైటాన్‌ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నారు.
1914: ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ జననం (ఫొటోలో)
1931: స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు గణేశ్ శంకర్ విద్యార్థి మరణం.
1933: భారతీయ శాస్త్రవేత్త వసంత్ గోవారికర్ జననం.
2001: నటుడు కన్నడ ప్రభాకర్ మరణం.

News March 25, 2026

‘కంటికి తల..’ ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

image

5 రోజులు దాడులు ఆపుతామని ట్రంప్ చెప్పినా ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. మా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై చెయ్యేస్తే ‘కంటికి కన్ను కాదు.. కంటికి తల’ తీస్తామంటూ IRGC మాజీ కమాండర్ మొహసేన్ రెజాయీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా షిప్పులను గల్ఫ్‌లో ముంచేస్తామని హెచ్చరించారు. ఆంక్షలు ఎత్తేసి, నష్టపరిహారం చెల్లిస్తేనే ఘర్షణలు ఆగుతాయని తేల్చి చెప్పారు. USను కాపాడుకునేందుకు ఎక్కువ సమయం లేదని హెచ్చరించారు.