News August 4, 2024
బోణీ కొడతారా?

తొలి వన్డేలో చేజేతులా విజయాన్ని చేజార్చుకున్న భారత్, నేడు శ్రీలంకతో రెండో వన్డే ఆడనుంది. తొలి మ్యాచులో పొరపాట్లను రిపీట్ చేయకుండా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రోహిత్ సేన చూస్తోంది. వికెట్ కీపర్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉండగా పరాగ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రోహిత్, రాహుల్ మినహా మిగతా బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.
Similar News
News March 23, 2026
పెండింగ్ బకాయిల విడుదల, PRCపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. పెండింగ్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ప్రతినెలా ఇస్తోన్న ₹700 కోట్లను ₹1,000 కోట్లకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 1వ తేదీనే జీతాలు, క్యాష్‌లెస్ హెల్త్ కార్డ్స్, పెండింగ్ DAల విడుదల, ₹1.25 కోట్ల ప్రమాద బీమా వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలోనే PRCపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
News March 23, 2026
కీలక బిల్లు: విద్వేష ప్రసంగాలు చేస్తే 7 ఏళ్ల జైలు

TG: విద్వేష ప్రసంగాలు చేసేవారి భరతం పట్టేలా కీలక బిల్లును GOVT ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇలాంటి ప్రసంగాలు చేస్తే తొలిసారి ₹50000 జరిమానా, 7 ఏళ్ల జైలు విధిస్తారు. రెండోసారి కూడా చేస్తే ₹1 లక్ష జరిమానా, 10 ఏళ్లు జైలు తప్పదు. ఇప్పటికే ఇలాంటి చట్టం కర్ణాటకలో ఉంది. కాగా పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనం నుంచి 10-15% కట్ చేసి వారికి అందించేలా మరో బిల్లునూ త్వరలో పెట్టనున్నారు.
News March 23, 2026
అఫిడవిట్ ఉంటేనే సాదాబైనామా రిజిస్ట్రేషన్లు!

TG: సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు రెవెన్యూశాఖ కొత్త రూల్స్‌ను GOVTకి ప్రతిపాదించింది. ఇకపై వీటి రిజిస్ట్రేషన్‌కు అఫిడవిట్లను తప్పనిసరి చేయడం వంటి రూల్సు రానున్నాయి. రాష్ట్రంలో దాదాపు 9.50 లక్షల సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు రాగా అందులో 20వేలు మాత్రమే పరిష్కారమయ్యాయి. న్యాయపరమైన చిక్కులతో మిగతావి పెండింగ్‌లో పడ్డాయి. కొత్త రూల్స్ వస్తే అఫిడవిట్ ఉంటేనే సాదాబైనామా రిజిస్ట్రేషన్ అవుతుంది.


