News August 4, 2024
నేటి నుంచి జీడి పరిశ్రమలు ఓపెన్

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ, పరిసర ప్రాంతాల్లో ఉన్న జీడి పరిశ్రమలను ఆదివారం నుంచి తెరుస్తున్నామని పలాస పారిశ్రామికవాడ జీడి పరిశ్రమల సంఘ అధ్యక్షుడు మల్లా రామేశ్వరం వెల్లడించారు. జులై 19వ తేదీ నుంచి జీడి ఉత్పత్తులు పేరుకుపోవడంతో పరిశ్రమలు తాత్కాలికంగా బంద్ చేశామని చెప్పారు. ఆదివారం నుంచి బాయిలింగ్, కటింగ్ కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Similar News
News March 20, 2026
శ్రీకాకుళం: గ్రామ కట్టుబాటు.. భర్తకు కొరివి పెట్టిన భార్య..!

శ్రీకాకుళం(D)లో వింత ఘటన చోటుచేసుకుంది. కంచిలి(M) గోకర్ణపురానికి చెందిన బల్ల వైకుంఠరావు అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. అతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. తలకొరివి పెట్టాల్సిన కొడుకు ఊరుదాటి వెళ్లి డిప్లొమా పరీక్షలకు వెళ్లాల్సి ఉండగా.. ఊరు కట్టుబాట్ల ప్రకారం కొరివి పెట్టినవాళ్లు ఊరు బయటకు వెళ్లరాదు. కుమార్తె అనారోగ్యంతో ఉంది. దీంతో వైకుంఠరావుకు భార్యే కొరివి పెట్టారు.
News March 20, 2026
ఇచ్ఛాపురంలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

ఇచ్ఛాపురంలో గురువారం రాత్రి జరిగిన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బెల్లుపడ గ్రామానికి చెందిన ఉప్పాడ కుమార్ మృతి చెందారు. బైక్‌పై వస్తున్నా కుమార్ ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుమార్ బైక్ నుజ్జునుజ్జయిందని, తలకు బలమైన గాయం తగలడంతో స్థానికులు చూసే సరికి మృతిచెంది ఉన్నాడని ఎస్ఐ ముకుందరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News March 20, 2026
అరసవల్లి ఇంద్రపుష్కరిణి అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఇంద్రపుష్కరిణి అభివృద్ధి పనులకు రూ.4 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కింజరాపు అచ్చెన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 21న ఇంద్ర పుష్కరణి ఆధునీకరణ పనులకు మంత్రితో శంకుస్థాపన చేయించేందుకు ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంపుకార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.


