News August 4, 2024
విశాఖ రైల్వే జోన్‌కు ప్రాధాన్యత: కేంద్ర మంత్రి

కూటమి ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌కు గతంలోనే బడ్జెట్ కేటాయించిందన్నారు. 52 ఎకరాల స్థలం విశాఖలో కేటాయించాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం భూమిని సేకరించలేకపోయిందన్నారు. భూసేకరణకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
Similar News
News March 4, 2026
రేపు విశాఖలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

నరవ నుంచి వచ్చే ప్రధాన పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని ఈస్ట్, వెస్ట్, పెందుర్తి జోన్ల పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని జీవీఎంసీ ఈఈ మురళీకృష్ణ తెలిపారు. లక్ష్మీ నగర్, జ్యోతి నగర్ ఏరియాల్లో లీకేజీలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని, ప్రజలు సహకరించాలన్నారు.
News March 4, 2026
విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశం

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన విద్యుత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ చోరీలను అరికట్టాలని, ఆర్‌డీఎస్‌ఎస్ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేసి వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
News March 4, 2026
భూగర్భ విద్యుత్ పనులు త్వరగా పూర్తి చేయండి: విశాఖ ఎంపీ

విశాఖలో జరుగుతున్న భూగర్భ విద్యుత్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఎంపీ శ్రీ భరత్ విద్యుత్ అధికారులకు సూచించారు. విశాఖ కలెక్టరేట్‌లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 11 మండలాల్లో విద్యుత్ సరఫరా పనితీరు, సోలార్ విద్యుత్ వినియోగం, భూగర్భ పనులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్యాంబాబు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.


