News August 4, 2024

కోనసీమ: సచివాలయ ఉద్యోగినితో అసభ్య ప్రవర్తన.. కేసు

image

ఓ సచివాలయ ఉద్యోగి సహోద్యోగినిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేసినట్లు SI చిరంజీవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. అంబాజీపేట మండలం నందంపూడి గ్రామానికి చెందిన సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ధోనిపాటి రాంజీ పెన్షన్ల నెపంతో సహోద్యోగిని ఇంటికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు. ఆమె ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేశామన్నారు.

Similar News

News March 30, 2026

వాహనాల వేలం ద్వారా రూ.10.06 లక్షల ఆదాయం: ఆర్టీఓ

image

జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పన్ను బకాయిలు, ఫిట్‌నెస్ లేని 36 వాహనాలకు సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.10,06,600 ఆదాయం సమకూరినట్లు జిల్లా రవాణా అధికారి (ఆర్టీఓ) ఆర్.సురేశ్ తెలిపారు. పారదర్శకంగా జరిగిన ఈ వేలంలో వివిధ కేటగిరీల వాహనాలను వేలం వేశామన్నారు. యజమానులు సకాలంలో పన్నులు చెల్లించి పత్రాలు సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.

News March 30, 2026

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లపై ఉక్కుపాదం.. ఎస్పీ హెచ్చరిక

image

ఐపీఎల్‌ మ్యాచ్‌ల సాకుతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ హెచ్చరించారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే మాయమాటలతో యువతను లక్ష్యంగా చేసుకునే వారిపై నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్‌ నిర్వాహకుల గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 112కు తెలపాలని కోరారు. నిర్వాహకులు ఎంతటి వారైనా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.

News March 29, 2026

రాజమండ్రి: ‘జనగణన డేటా సేకరణ పకడ్బందీగా చేపట్టాలి’

image

2027 గృహ జనగణన డేటా సేకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని డీఆర్ఓ సీతారామ మూర్తి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్‌ఎంసీ సమావేశ మందిరంలో 2027 గృహ జనగణన డేటా సేకరణకు సంబంధించి నియమితులైన ఫీల్డ్ ట్రైనర్లకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గృహ, జనగణన డేటా సేకరణలో క్షేత్ర శిక్షకులు ప్రధాన పాత్ర పోషించాలని, అందుకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.