News August 4, 2024
వరంగల్‌లో దోస్తానా అంటే ప్రాణం!

దోస్తానా అంటే ఓరుగల్లు వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
Similar News
News February 1, 2026
హనుమకొండ: మినీ మేడారం జాతరలో 13వేల మందికి చికిత్స

హనుమకొండ జిల్లా వ్యాప్తంగా జరిగిన మినీ మేడారం జాతరలో 13,242 మంది భక్తులకు వైద్య సేవలు అందించినట్లు DMHO డా.అప్పయ్య తెలిపారు. హయగ్రీవాచారి మైదానం, ఆత్మకూరు, ఊరుగొండ తదితర ప్రాంతాల్లోని ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా ఈ సేవలు అందజేశామన్నారు. మెరుగైన చికిత్స కోసం 19 మందిని పెద్దాసుపత్రికి తరలించామని, 10 మందికి కుక్కకాటు ఇంజక్షన్లు ఇచ్చినట్లు వెల్లడించారు.
News February 1, 2026
రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేశాం: కలెక్టర్

జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 45% జరిగిందని,100 శాతం పూర్తయ్యేలా అధికారులందరు సమన్వయంతో పని చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ పాల్గొని జిల్లాలో అమలు తీరును తెలిపారు.
News January 29, 2026
రేపు విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్

మేడారం మహాజాతరను పురస్కరించుకుని ఈ నెల 30 (శుక్రవారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ సత్య శారద ఉత్తర్వులు జారీ చేశారు. వనదేవతల దర్శనానికి వెళ్లే భక్తులు, సిబ్బంది సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేదీని (రెండవ శనివారం) పనిదినంగా పరిగణించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.


