News August 4, 2024
అనంత: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై పోక్సో కేసు

రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం గ్రామానికి చెందిన మధుకుమార్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకున్న మధుకుమార్ ప్రేమ పేరుతో మరో బాలికను మోసం చేసినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ‘14 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. బాలిక గర్భం దాల్చి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం’ అని వివరించారు.
Similar News
News April 2, 2026
ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని DPMU కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రకృతి వ్యవసాయ టీవోటీ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. పీడీఎంఎస్‌ను జిల్లాలో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో వినూత్న మోడల్స్ జిల్లా ద్వారా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలకు ఆదర్శం అవ్వడం గర్వకారణం అని అన్నారు.
News April 2, 2026
అమరావతి చట్టబద్ధతను జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: టీసీ వరుణ్

అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించడాన్ని మాజీ సీఎం జగన్ జీర్ణించుకోలేక నిప్పులు కక్కుతున్నారని అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ మండిపడ్డారు. పబ్జీ గేమ్ స్ఫూర్తితో రాజధానిపై వ్యాఖ్యలు చేస్తూ నవ్వులపాలవుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పటిష్ఠ నాయకత్వంలోనే రాజధాని అజేయంగా నిలిచిందన్నారు. దీనికి మద్దతు తెలిపిన పార్టీలకు జనసేన తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
News April 2, 2026
అనంతపురం ఇక నుంచి 62 డివిజన్లు

50 డివిజన్లకు పరిమితమైన అనంతపురం నగరపాలక సంస్థకు మరో 12 డివిజన్లు అదనంగా పెంచారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62 డివిజన్లుగా మార్పు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కావాలనుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలోని ఆశావాహులకు ఇదో చక్కటి అవకాశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.


