News August 4, 2024
శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే రైళ్లు దారి మళ్లింపు

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లే ఈస్ట్కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు 18046 రైలును ఆగస్టు 3 నుంచి 11 వరకు, 18045 ట్రైను ఆగస్టు 2 నుంచి 10 వరకు గుణదల, రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆయా రోజుల్లో ఈ రైళ్లు విజయవాడ మీదుగా వెళ్లవని, సమీపంలోని రాయనపాడులో ఈ రైళ్లకు స్టాప్ ఇచ్చామని అధికారులు తెలిపారు.
Similar News
News March 5, 2026
శ్రీకాకుళం: ఇంటర్ అర్హతతో ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో సిక్కోలు యువత అధికంగా విధులు నిర్వహిస్తుంటారు. ఎప్పటికప్పుడు జరిగిన త్రివిధ దళాల ర్యాలీల్లో పాల్గొని జాబ్స్‌ను సాధిస్తారు. ఈ ప్రయత్నాల్లో ఉన్న వారికి మరో శుభవార్త. అగ్నివీర్ ద్వారా ఇంటర్ అర్హతతో ఈ నెల 8-18 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ఓపెన్ ర్యాలీ జరగనుంది. తక్కువ వయసులో ఉద్యోగాలు పొందేందుకు ఇదో చక్కటి అవకాశం.
News March 5, 2026
SKLM: మార్చి 8న అస్మిత అథ్లెటిక్స్ పోటీలు

శ్రీకాకుళం నగరంలో మార్చి 8న కోడి రామ్మూర్తి స్టేడియంలో ‘అస్మిత’ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. 13-18 ఏళ్లున్న వారు అర్హులన్నారు. https://nsrs.kheloindia.gov.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News March 5, 2026
టెక్కలి: విద్యార్థిని ఆత్మహత్య ఎందుకు చేసుకుందో?

టెక్కలి(M) తలగాం గ్రామ సమీపంలో బుధవారం <<19298091>>రైలు కింద పడి మృతి చెందిన<<>> ఇంజినీరింగ్ విద్యార్థిని కె.ప్రవల్లిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టాలపై రైలుకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్లిందని స్థానికులు తెలిపారు. అయితే ప్రవల్లిక ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఈ నెల 21న వివాహం జరగాల్సి ఉంది. ఇష్టం లేని పెళ్లి కారణమా? లేదా ఇతర బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియాల్సి ఉంది.


