News August 4, 2024

నిజామాబాద్‌లో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే నిజామాబాదీలు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ ఉమ్మడి NZB జిల్లాలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్ వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?
Happy Friendship Day

Similar News

News January 15, 2026

NZB: మున్సిపల్ రిజర్వేషన్లు ఇలా..

image

నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా STకి ఒకే ఒక్క స్థానం దక్కింది.
1.నిజామాబాద్ కార్పొరేషన్‌- ST(G)-1, SC(G)-3, W-2, BC(G)-12, W-12 UR(G)-14, W-16
2.బోధన్- ST(G)-1, SC(G)-2, W-1 BC(G)-8, W-7 UR(G)8-, W-11
3.ఆర్మూర్- ST(G)-1, SC(G)-2 W-1, BC(G)-7, W-7 UR(G)-8, W-10
4.బీమ్‌గల్- ST(G)-1, SC(G)-1 W-1, BC(G)-2, W-1 UR(G)-2, W-4

News January 14, 2026

NZB: మత్తు మందు ఇచ్చి దొంగతనం.. ముఠా అరెస్ట్

image

వ్యాపారం పేరిట మాయమాటలు చెప్పి, మత్తు మందు కలిపిన బీరు ఇచ్చి నగలు దొంగిలించిన ముఠాను నిజామాబాద్ టౌన్-4 పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రసాద్, నర్సింగరావు, రుద్రా యాదవ్ అనే ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి నగదు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీల్లో వీరు పలు నేరాలకు పాల్పడినట్లు ఎస్హెచ్ఓ సతీశ్ కుమార్ తెలిపారు.

News January 14, 2026

నిజామాబాద్: ఆర్టీసీ స్పెషల్ వసూళ్లు !

image

సంక్రాంతి నేపథ్యంలో నిజామాబాద్ రీజియన్‌లోని ఆరు డిపోల నుంచి వివిధ రూట్లల్లో 500 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతుండగా గ్రామీణా ప్రాంతాలకు వెళ్లే బస్సులు తగ్గడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లేవారి నుంచి స్పెషల్ పేరిట అదనంగా 50 శాతం పసూళ్లు చేస్తోందని, పండగపూట ఆర్టీసీ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.