News August 4, 2024
కరీంనగర్‌లో దోస్తానా అంటే ప్రాణం!

దోస్తానా అంటే కరీంనగర్ వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
Similar News
News March 26, 2026
KNR: అసెంబ్లీ ముట్టడికి యత్నం.. DYFI నేతల అరెస్టు

యువజన హక్కుల సాధనకై DYFI పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలైన 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిని అమలు చేయకుండా ప్రభుత్వం యువతను వంచిస్తోందని మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు.
News March 26, 2026
KNR: గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటి విడుదల

ఎండాకాలం దృష్ట్యా రైతుల పంటలు ఎండిపోకుండా నీటిని అందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హైదరాబాద్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంగళవారం కోరారు. దీంతో రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నీటిని అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.