News August 4, 2024

ఈ నెల 9 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’

image

దేశంలోని ప్రతి ఒక్కరూ ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్‌సైటులో అప్‌లోడ్ చేయాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ గతంలో ప్రారంభించిన ఈ ప్రచారం పెద్ద ఉద్యమంగా మారిందని షా అభిప్రాయపడ్డారు.

Similar News

News April 11, 2026

చర్మంపై నల్లటి మచ్చలా.. ఇలా చేయండి!

image

సూర్యరశ్మి, కాలుష్యం, హార్మోన్ల మార్పుల వల్ల చర్మంపై నల్లటి మచ్చలు (పిగ్మెంటేషన్) ఏర్పడతాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. సన్‌స్క్రీన్ వాడకం, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చని సూచిస్తున్నారు. కాలుష్యం వల్ల కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ చర్మాన్ని దెబ్బతీస్తుందని, సరైన పోషణతో దీనిని నివారించవచ్చని పేర్కొంటున్నారు. హెల్తీ లైఫ్‌స్టైల్ చర్మ సౌందర్యానికి కీలకమంటున్నారు.

News April 11, 2026

25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు ప్రకటన

image

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల పరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే చివరి వరకు దేశంలోని వివిధ సెంటర్లలో <>ఎగ్జామ్స్<<>> జరుగుతాయని పేర్కొంది. కాగా ఫిబ్రవరి 23నే పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. BSF, CISF, CRPF, SSB, ITBP, SSF, NCBలో మొత్తం 25,487 ఉద్యోగాలు ఉన్నాయి.
Share It

News April 11, 2026

రేపటి వరకు వర్షాలు!

image

ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సముద్ర మట్టానికి 0.9కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఆస్కారముందని వివరించింది.