News August 4, 2024

APPLY NOW.. 44,288 ఉద్యోగాలు

image

దేశ వ్యాప్తంగా పోస్టాఫీసుల్లోని 44,228 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి <<13636461>>దరఖాస్తుల<<>> స్వీకరణ కొనసాగుతోంది. రేపటి(ఆగస్టు 5)తో గడువు ముగుస్తుంది. 6 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. టెన్త్ పాసైన 18 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు. ఏపీలో 1355, TGలో 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News March 10, 2026

రాష్ట్రంలో ఈవినింగ్ బీటెక్ కోర్సులు

image

TG: సాయంత్రం వేళల్లో తరగతులు నిర్వహించేలా బీటెక్, ఎంటెక్ కోర్సులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచే 12 ప్రైవేట్ కాలేజీల్లో ఒకటి నుంచి 5 కోర్సులకు అనుమతించింది. ఒక్కో కళాశాలలో గరిష్ఠంగా 60 సీట్లు ఉంటాయి. పాలిటెక్నిక్ పూర్తి చేసి ఏడాది ఉద్యోగ అనుభవం ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరవచ్చు. దీనివల్ల ఎంతో మందికి మేలు జరగనుంది. రెగ్యులర్ కోర్సులకు ఉన్న ఫీజునే చెల్లించాలి.

News March 10, 2026

మెగా కోడలికి ఆన్‌లైన్ వేధింపులు.. కేసు నమోదు

image

తనపై ఓ వ్యక్తి SMలో వేధింపులకు పాల్పడుతున్నాడంటూ నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నా వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీసేలా ‘Purple Crayon00’ ఇన్‌స్టా ఖాతా ద్వారా పోస్టులు, కామెంట్లు చేస్తున్నాడు. నా కుటుంబీకులనూ దూషిస్తూ అవమానిస్తున్నాడు. అతడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2026

‘సారా’.. మళ్లీ కావాలంటోన్న MLA సారు.. మీరేమంటారు?

image

ఉమ్మడి APలో సారా సామాజిక, ఆర్థిక, కుటుంబ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. దానికి వ్యతిరేకంగా దూబగుంట రోశమ్మ స్ఫూర్తితో ఎంతో మంది తిరుగుబాటు చేయడంతో సారా నిషేధం అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు TGలో సారా షాపులు ఓపెన్ చేయాలని MLA అనిరుధ్ డిమాండ్ చేయడం <<19339452>>చర్చనీయాంశమవుతోంది<<>>. గతంలో సారా తాగి 115 ఏళ్లు బతికారంటూ అన్‌సైంటిఫిక్ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు?