News August 4, 2024
నెల్లూరులో యువతకు జాబ్ మేళా

నెల్లూరులో ఈనెల 8వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటలకు నెల్లూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో శ్రీరామ్ ఫైనాన్స్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంకు ప్రతినిధులు మేళా నిర్వహిస్తారన్నారు. ఏదైనా డిగ్రీ చదివి 18 – 30 సంవత్సరాల్లోపు వయసున్న వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు విద్యార్హత సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని తెలియజేశారు.
Similar News
News January 21, 2026
నెల్లూరు: అసలు దొంగలు ఎవరు..?

ఉదయగిరిలో పట్టుబడిన <<18909764>>ఎర్ర చందనం <<>>వెనుక అసలు పాత్రదారులు ఎవరనేది ప్రశ్నార్థకంగా ఉంది. అటవీ సిబ్బంది, పోలీసులకు తెలియకుండా భైరవకోన కొండ ప్రాంతం నుంచి ఉదయగిరి అర్లపడియ వైపు ఎర్రచందనం ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది. అక్కడ గ్రామస్థులు అడ్డుకోకపోయి ఉంటే సరిహద్దులు దాటి వెళ్లిపోయేది. నిఘాపెట్టాల్సిన పోలీసులు, అటవీ రేంజ్ సిబ్బందికి తెలియకుండానే ఇది జరిగి ఉంటుందా? అని స్థానికులు అనుమానిస్తున్నారు.
News January 21, 2026
నెల్లూరు: PACSలో ఇక ఆన్‌లైన్ సేవలు

నెల్లూరు జిల్లాలోని 76 PACSలకు గాను 71 సంఘాల్లో పూర్తిస్థాయి కంప్యూటీకరణ చేశామని జిల్లా సహకార శాఖ అధికారి గుర్రప్ప వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ ప్రక్రియపై సీఈవోలకు రెండు రోజుల శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఇకపై PACS సంఘాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మాన్యువల్ పద్ధతి ఉండదన్నారు.
News January 21, 2026
NLR: ఆడపిల్లలకు క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్

క్యాన్సర్ వ్యాధి నివారణ వైరస్(HPV), వ్యాక్సిన్‌ల పంపిణీపై వైద్య సిబ్బందికి నెల్లూరు DMHO సుజాత మంగళవారం శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో 14 ఏళ్లు పూర్తయి 15 ఏళ్ల లోపు ఆడపిల్లలను సర్వే ద్వారా గుర్తించి క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రాథమిక, అర్బన్ కేంద్రాలతోపాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3నెలల పాటు వ్యాక్సిన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.


