News August 4, 2024

మనూ భాకర్‌కు అరుదైన గౌరవం

image

ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్‌కు అరుదైన గౌరవం లభించనుంది. ఈ నెల 11న జరిగే ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో మను ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. పురుష పతాకధారి ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 10మీ. ఎయిర్ పిస్టల్ సింగిల్, మిక్స్‌డ్ విభాగాల్లో ఆమె కాంస్య పతకాలు సాధించారు. <<-se>>#Olympics2024<<>>

Similar News

News February 4, 2025

8th, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

AP: గురుకుల విద్యాలయాలలో 2025-26కుగాను ఎనిమిదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 7th, టెన్త్ ఉత్తీర్ణులైన వారు మార్చి 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష లోపు ఉండాలి. మార్చి 4న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. 9న పరీక్ష ఉంటుంది. 25న మెరిట్ జాబితా ప్రకటిస్తారు. ఏప్రిల్ 11, 21 తేదీల్లో రెండు దశల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

News February 4, 2025

కులగణన: నేడు క్యాబినెట్, అసెంబ్లీ సమావేశం

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ ఉ.10 గంటలకు సమావేశం కానుంది. కుల గణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సర్వేపై చర్చించనుంది. కులగణన తప్పుల తడక అంటూ బీసీ సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News February 4, 2025

‘తిల్లు ముల్లు’లా సూర్య, శాంసన్ తీరు: అశ్విన్

image

ENGతో T20 సిరీస్‌లో విఫలమైన సూర్య, శాంసన్‌ ఆట తీరుపై అశ్విన్ స్పందించారు. ‘తిల్లు ముల్లు అనే మూవీలో రజినీకాంత్ 2 పాత్రలు పోషిస్తారు. మీసంతో ఒకటి, లేకుండా మరో క్యారెక్టర్‌లో ఉంటారు. సంజూ, సూర్యలను చూస్తుంటే అలాగే ఉంది. 5మ్యాచ్‌లలో ఒకే రకమైన బాల్, షాట్‌కు ఔట్ అయ్యారు. సూర్య తన బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాలి. మనసులో అనేక ఆలోచనలతో సంజూ ఉన్నారు. ఇలా ఉంటే బ్యాటింగ్ చేయడం కష్టం’ అని పేర్కొన్నారు.