News August 4, 2024

మాకూ రూ.15వేల పింఛను ఇవ్వాలి: సికిల్ సెల్ బాధితులు

image

AP: కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇస్తున్న మాదిరిగానే తమకు నెలకు రూ.15వేల పింఛన్ ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను సికిల్ సెల్ బాధితులు కోరారు. అరకులోని తాము రక్త మార్పిడికి పాడేరు, వైజాగ్ వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. స్థానికంగానే బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. కాగా సికిల్ సెల్ జన్యుపరమైన లోపంతో వచ్చే రక్త సంబంధిత వ్యాధి.

Similar News

News April 3, 2026

విజయ్ అఫిడవిట్లలో తేడాలు.. నామినేషన్ తిరస్కరణకు ఛాన్స్?

image

TVK చీఫ్ విజయ్ తాను పోటీ చేసే అసెంబ్లీ స్థానాలకు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో తేడాలున్నాయి. పెరంబూర్ సెగ్మెంట్ అఫిడవిట్‌లో తనపై కేసులు లేవని పేర్కొనగా, తిరుచిరాపల్లి ఈస్ట్ నామినేషన్‌లో 2 FIRలు ఉన్నట్లు వెల్లడించారు. 2025లో పెరవల్లూరు PSలో నమోదైన కేసు వివరాలనూ చూపలేదు. దీంతో ఆయన సవరించిన అఫిడవిట్లను దాఖలు చేయకపోతే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

News April 3, 2026

కవిత తన పార్టీకి TRS పేరు పెడతారా?

image

TG: కొత్త పార్టీ పెట్టనున్న వేళ HYD ప్రెస్‌‌మీట్లో జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. TRS పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చన్నారు. తాము పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తున్నామని తెలిపారు. దీంతో తన పార్టీకి TRS పేరు పెట్టనున్నారా? అనే చర్చ మొదలైంది. కానీ ఇప్పటికే కవిత పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.

News April 3, 2026

చద్దాను సైలెంట్ చేయడానికి కారణాలివేనా?

image

రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తప్పించడానికి బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా పార్టీ విషయాలపై ఆయన మౌనం వహిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ నిర్దోషి అని తేలాక జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. అలాగే పంజాబ్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, రాజ్యసభలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆప్ వర్గాలు ఆరోపించాయి.