News August 4, 2024
మూడేళ్లలో బెంగళూరును అధిగమిస్తాం: మంత్రి

సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఎగుమతిలో రూ.7లక్షల కోట్లతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
వచ్చే మూడేళ్లలో తాము బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు నేటి నుంచి ఈనెల 13 వరకు మంత్రి అమెరికా, సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు.
Similar News
News March 13, 2026
కరీంనగర్ పీటీసీలో పాసింగ్ అవుట్ పరేడ్

కరీంనగర్‌లోని స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రం (PTC)లో 2025–2026 బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ వైభవంగా జరిగింది. ఈ శిక్షణలో అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి TGSP కానిస్టేబుల్ గోగికర్ రోహన్ ‘ఆల్ రౌండర్’ అవార్డును కైవసం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్యఅతిథిగా హాజరై రోహన్‌కు ట్రోఫీని అందజేసి, ప్రత్యేకంగా అభినందించారు.
News March 12, 2026
KNR: ఆర్ఎంపీ కళ్లలో కారం కొట్టి గొలుసు అపహరణ

తిమ్మాపూర్ మండలం నేదునూరులో ఆర్ఎంపీ తమ్మనవేణి కొమరయ్యపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి విధి నిర్వహణ ముగించుకొని వస్తుండగా, జెన్కో సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగి.. అకస్మాత్తుగా కొమరయ్య కళ్లలో కారంపొడి చల్లాడు. ఈ క్రమంలో కొమరయ్య వద్ద నుంచి 12 గ్రాముల బంగారు గొలుసు, నగదు ఎత్తుకెళ్లి మామిడి తోటలోకి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News March 12, 2026
కరీంనగర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

కరీంనగర్(D)లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలన్నారు. సింగిల్ సిలిండర్‌కు 25 రోజులు, డబుల్‌కు 15 రోజుల గడువు ఉంటుందని తెలిపారు. గ్యాస్ పొందే సమయంలో ఓటీపీ తప్పనిసరిగా చెప్పాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


