News August 4, 2024

అధికారులు నిద్రపోతున్నారా?: ఆదిమూలపు సురేశ్

image

‘డీలర్లు రాజీనామా చేస్తే షాపులకు ఇన్‌ఛార్జ్‌గా రెవెన్యూ అధికారులను నియమించి రేషన్ బియ్యం పంపిణీ చేయాలి. అలా కాకుండా TDP నేతల గృహాల్లో దిగుమతి చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు నిద్రపోతున్నారా’ అని మాజీ మంత్రి సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపిలోని YCP కార్యాలయంలో శనివారం మాట్లాడారు. YCP సానుభూతి పరులని చెప్పి అర్హులైన వారి పింఛన్లు తొలగిస్తే ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Similar News

News March 22, 2026

ప్రకాశం: ‘నేడు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు’

image

ప్రకాశం జిల్లాలో ఆదివారం కూడా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్ణీత సమయంలో బిల్లు చెల్లించడం వలన పెనాల్టీ పడదని అన్నారు. ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.

News March 22, 2026

గంజాయి నిందితులకు ఒంగోలులో కౌన్సెలింగ్

image

మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా ఒంగోలులో గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు.