News August 4, 2024
విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇవాళ లంకతో జరగబోయే రెండో వన్డేలో 92 రన్స్ సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులు పూర్తి చేసుకుంటారు. అదే జరిగితే ఈ మైలు రాయి చేరిన నాలుగో క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కుతారు. అలాగే 128 రన్స్ చేస్తే వన్డేల్లో 14 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో ప్లేయర్‌గా ఘనత సాధిస్తారు.
Similar News
News February 4, 2025
కులగణన: నేడు క్యాబినెట్, అసెంబ్లీ సమావేశం
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ ఉ.10 గంటలకు సమావేశం కానుంది. కుల గణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సర్వేపై చర్చించనుంది. కులగణన తప్పుల తడక అంటూ బీసీ సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News February 4, 2025
‘తిల్లు ముల్లు’లా సూర్య, శాంసన్ తీరు: అశ్విన్
ENGతో T20 సిరీస్‌లో విఫలమైన సూర్య, శాంసన్ ఆట తీరుపై అశ్విన్ స్పందించారు. ‘తిల్లు ముల్లు అనే మూవీలో రజినీకాంత్ 2 పాత్రలు పోషిస్తారు. మీసంతో ఒకటి, లేకుండా మరో క్యారెక్టర్‌లో ఉంటారు. సంజూ, సూర్యలను చూస్తుంటే అలాగే ఉంది. 5మ్యాచ్‌లలో ఒకే రకమైన బాల్, షాట్‌కు ఔట్ అయ్యారు. సూర్య తన బ్యాటింగ్ విధానాన్ని మార్చుకోవాలి. మనసులో అనేక ఆలోచనలతో సంజూ ఉన్నారు. ఇలా ఉంటే బ్యాటింగ్ చేయడం కష్టం’ అని పేర్కొన్నారు.
News February 4, 2025
రూ.5,447 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం: టీడీపీ
AP: మార్చి 12న వైసీపీ తలపెట్టిన ‘ఫీజు పోరు’పై టీడీపీ Xలో ఫైరయ్యింది. గత ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్, చిక్కీలు, కోడిగుడ్లు, వసతి దీవెన కింద ₹5,447 కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించింది. YS జగన్ విద్యార్థులు, వారి పేరెంట్స్‌ను మానసిక క్షోభకు గురి చేస్తే లోకేశ్ ₹800 కోట్లు విడుదల చేసి మనోధైర్యాన్ని నింపారని పేర్కొంది. YCP నేతలు ‘ఫీజు పోరు’ కలెక్టరేట్ల ముందు కాకుండా జగన్ యలహంక ప్యాలెస్ ముందు చేయాలంది.