News August 4, 2024
దళిత బంధు దారి తప్పితే సహించేది లేదు: డిప్యూటీ సీఎం
దళిత బంధు దారి తప్పితే సహించేది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దళిత బంధు దుర్వినియోగంలో లబ్ధిదారునికి ఎంత పాత్ర ఉంటుందో, ప్రత్యేక అధికారులకు అంతే పాత్ర ఉంటుందన్నారు. మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన దళితబంధు లబ్ధిదారులకు వారంలోగా రెండో దశ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. దళితబంధు కింద మంజూరైన యూనిట్లు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా? లేదా? విచారణ చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News January 15, 2025
ఖమ్మంలో: యువకుడి మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
ఖమ్మం గ్రామీణ మండలం పోలెపల్లి పంచాయతీ రాజీవ్ గృహకల్పకు చెందిన <<15158548>>సంజయ్‌కుమార్ <<>>తన అన్న సాయిని పిక్అప్ చేసుకోడానికి వెళ్లి మిస్సయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెనాల్ కాలువలో ఆ యువకుడి డెడ్ బాడీ లభించడం కలకలం రేపింది. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి బంధువులు, స్నేహితులు రోడ్డుపై బైఠాయించి, ధర్నా చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News January 15, 2025
KMM: మేకపోతులు కొనేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలైన ఘటన పెనుబల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పార్థసారథిపురం గ్రామానికి చెందిన కీసర రాజు, కుంజా మహేశ్ కనుమ కావడంతో బైక్‌పై మేకపోతులు కొనేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 15, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యాటన ∆} అమ్మపేటలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన