News August 4, 2024
NLG: వారం రోజుల్లో జిల్లాకు అదనంగా ఎరువులు

సాగర్ నీటి విడుదల నేపథ్యంలో ఈ సీజన్లో జిల్లాకు అదనంగా 4,400 మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయిస్తామని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావు హామీ ఇచ్చారని డీఏఓ శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచన మేరకు నెల వారి కోటా కంటే అదనంగా కేటాయించారని పేర్కొన్నారు. ఆ ఎరువులు వారం రోజుల్లో జిల్లాకు రానున్నాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 13, 2026
గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్‌కు 45 రోజుల గడువు

వంట గ్యాస్ సరఫరాపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క సిలిండర్ తర్వాత మరో సిలిండర్ బుకింగ్‌కు కనీసం 45 రోజుల గడువు ఉండాలని నిర్ణయించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 25 రోజుల నిబంధనే కొనసాగుతోంది. గ్యాస్ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించడమే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
News March 13, 2026
NLG: 62 పోస్టులు.. 16న ఇంటర్వ్యూలు

ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది కోసం ఈనెల 16న ప్రిన్సిపల్ ఛాంబర్‌లో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. మెడికల్ కళాశాలలో ఒక ప్రొఫెసర్, 15 అసోసియేట్ ప్రొఫెసర్స్, 32 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 14 మంది ట్యూటర్స్‌ను తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు రిక్రూట్ చేసుకోనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు.
News March 13, 2026
NLG: ఒక్కో పంటపై రూ.2వేల పెంపు..!

రాబోయే సాగు సీజన్‌కు సిద్ధమవుతున్న జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ పంటల రుణ పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఒక్కో పంటపై అదనంగా రూ.2,000లు పెంచుతూ బ్యాంకర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నల్లగొండ జిల్లాలోని సుమారు 5,65,803 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.


