News August 4, 2024

ఇమానే ఖెలీఫ్ అమ్మాయే: ఆమె తండ్రి

image

అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్ అమ్మాయేనని ఆమె తండ్రి ఒమర్ ఖెలీఫ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన వీడియోలో ప్రదర్శించారు. ‘నా బిడ్డ ఆడపిల్లగానే పెరిగింది. కష్టపడటం, ధైర్యంగా ఉండటం నేర్పా. ఒలింపిక్స్ వరకు రావడానికి ఆమె చాలా శ్రమించింది. ఇటలీ బాక్సర్ కంటే నా కూతురు బలంగా ఉంది కాబట్టే సులువుగా గెలిచింది’ అని ఆయన వివరించారు. కాగా <<13756877>>ఇమానే<<>> సెమీస్‌కు చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు.

Similar News

News March 16, 2026

చాబహార్ పోర్టుపై అమెరికా దాడి

image

ఇరాన్‌పై అమెరికా దాడులు తీవ్రం చేసింది. ఆ దేశ వాణిజ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా చాబహార్ పోర్టుపై దాడికి దిగింది. అక్కడి మిలిటరీ స్థావరంపై ఫైటర్ జెట్లతో విరుచుకుపడింది. మరోవైపు నిన్న రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేసింది. విమానాశ్రయంలోని ఆయిల్ ట్యాంకర్ నుంచి చెలరేగిన మంటలు తాజాగా అదుపులోకి వచ్చాయి. దాడి నేపథ్యంలో ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.

News March 16, 2026

మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు: అంకుల్ విజయ్

image

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా మైనర్ అని, 2009లో పుట్టారని ఆమె అంకుల్ విజయ్ భోస్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్‌పోర్టు పత్రాల్లో ఆమె వయసును ఎక్కువ చేసి చూపారని తెలిపారు. ఫర్మాన్‌ ఖాన్‌‌తో వివాహం చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు. ఈ పెళ్లి లవ్ జిహాదేనని ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా <<19360382>>మరోసారి<<>> స్పష్టం చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

News March 16, 2026

ఆస్కార్-2026 చిత్రాలు ఏ OTTలో ఉన్నాయంటే?

image

* వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్- జియో హాట్‌స్టార్
* సిన్నర్స్- జియో హాట్‌స్టార్
* ఫ్రాంకెన్‌స్టైన్- నెట్‌ఫ్లిక్స్
* కెపాప్ డీమన్ హంటర్స్- నెట్‌ఫ్లిక్స్
* వెపన్స్- జియో హాట్‌స్టార్
* F1- ప్రైమ్ వీడియో(రెంట్), ఆపిల్ టీవీ