News August 4, 2024
NLG: చౌటుప్పల్ లో ఇంటర్ చేంజ్ కూడలి!

రీజనల్ రింగ్ రోడ్డుపై భారీ ఇంటర్ చేంజ్ కూడళ్లను నిర్మించబోతున్నారు. HYD-పుణె హైవేని క్రాస్ చేసే సంగారెడ్డి సమీపంలోని గిర్మాపూర్ వద్ద.. HYD-VJD హైవేని క్రాస్ చేసే CPL వద్ద ఈ కూడళ్లు ఉంటాయి. వీటికోసం ఢిల్లీ ఔటర్ రింగురోడ్డుపై నిర్మించిన ‘ఎక్స్టెండెడ్ డంబెల్’డిజైన్ ను ఎంపిక చేశారు. 8 వరసల (తొలి దశలో 4 వరసలు)తో రీజనల్ రింగు రోడ్డును నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంటర్ చేంజ్ లను విశాలంగా రూపొందిస్తున్నారు.
Similar News
News March 11, 2026
నల్గొండ: ‘పది’ పరీక్షలకు 19,845 మంది విద్యార్థులు

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం 109 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఏడాది మొత్తం 19,845 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 19,698 మంది రెగ్యులర్ కాగా, 137 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. గతంలో ఉన్న ఒక్క నిమిషం నిబంధనను ఈసారి సడలించారు.
News March 11, 2026
నల్గొండ: మునిసిపల్ కౌన్సిల్ సమావేశాల ఊసేదీ?

జిల్లాలో కొత్త మున్సిపల్ కౌన్సిళ్లు ఏర్పడి రోజులు గడుస్తున్నా, ఇంతవరకు సమావేశాల ఊసే లేకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదానికి కేవలం 20 రోజుల గడువు మాత్రమే ఉండటంతో పాలనపై ప్రభావం పడే అవకాశం ఉంది. అధికారులు ప్రస్తుతం బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆమోదం పొందుతామని స్పష్టం చేశారు.
News March 11, 2026
నల్గొండ: అప్పు విషయంలో గొడవ ప్రాణం తీసింది

అప్పు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆంజనేయులు, శంభు లింగం మధ్య అప్పు విషయంలో ఘర్షణ తలెత్తింది. శంభు లింగంకు తీవ్రగాయాలు కావడంతో ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంభు లింగం మరణించాడు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


