News August 4, 2024
OLYMPICS: గ్రేట్ బ్రిటన్‌తో భారత్ ఢీ

పారిస్ ఒలింపిక్స్‌లో దూసుకెళ్తున్న భారత హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్‌తో క్వార్టర్‌ఫైనల్‌లో తలపడుతోంది. ఈ గేమ్‌లో గెలిస్తే భారత్ సెమీస్‌లో అడుగుపెడుతుంది. గ్రూప్ దశలో కేవలం ఒక గేమ్ మాత్రమే ఓడిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన జోరును కొనసాగించాలని, బ్రిటన్‌ను చిత్తు చేయాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్, జియోసినిమా వెబ్‌సైట్, యాప్‌లో మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతోంది.
Similar News
News March 21, 2026
దేశాన్ని అమ్మేశారు.. కేంద్రంపై మమత ఫైర్

ఇంధన ధరలు పెంచాలని కేంద్రం ప్లాన్ చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దేశాన్ని అమ్మేశారని మండిపడ్డారు. ‘మన్మోహన్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేది. ఇప్పుడు రూ.1,100 చేశారు. రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయి’ అని చెప్పారు. మరోవైపు బెంగాల్‌లో అప్రకటిత రాష్ట్రపతి పాలన నడుస్తోందని ఫైరయ్యారు. ప్రధాని మోదీ నుంచి దేశాన్ని కాపాడటమే తనకు ప్రాధాన్యమని అన్నారు.
News March 21, 2026
SLBCలో రెండు వైపులా తవ్వకాలు: ఉత్తమ్

TG: SLBC ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ‘ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్‌లెట్ పనులు జరుగుతున్నాయి. రెండు వైపులా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రూల్స్ కఠినంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. సొరంగ మార్గంలో గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సచివాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు.
News March 21, 2026
‘ఒత్తిడికి లొంగేది లేదు’.. అమెరికాకు శ్రీలంక షాక్!

అమెరికా యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు పర్మిషన్ నిరాకరించి శ్రీలంక షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని లంక అధ్యక్షుడు దిస్సనాయకే పార్లమెంటులో వెల్లడించారు. ‘మట్టాల ఎయిర్‌పోర్టులో ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేందుకు ఈ నెల 4, 8 తేదీల్లో వచ్చిన 2 రిక్వెస్టులను తిరస్కరించాం. ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి. అయినా మేం లొంగిపోము. మిడిల్ ఈస్ట్ యుద్ధం సవాళ్లు విసురుతోంది. న్యూట్రల్‌గా ఉండేందుకు సాధ్యమైనదంతా చేస్తాం’ అని చెప్పారు.


