News August 4, 2024
9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 965 కి.మీ మైలేజీ!

విద్యుత్ వాహనాలకు బ్యాటరీ ఛార్జింగ్, మైలేజీ అతి పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. వీటి వలన ప్రజలు ఈవీలవైపు మొగ్గుచూపడం లేదు. సాంసంగ్ సంస్థ 2027 కల్లా దీనికి పరిష్కారాన్ని తీసుకొచ్చేందుకు చూస్తోంది. కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయి 965 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే బ్యాటరీని సంస్థ తయారుచేసింది. ఏ వాహనంలోనైనా దీన్ని వాడుకోవచ్చని 20 ఏళ్ల వరకు పనిచేస్తుందని చెబుతోంది. అయితే, ఎక్కువ ధర ఉండనుందని సమాచారం.
Similar News
News March 12, 2026
శ్రీకాళహస్తి–రేణిగుంట రహదారిపై ప్రమాదం.. వృద్ధుడి మృతి

శ్రీకాళహస్తి–రేణిగుంట రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన మంగా మాలిక్ (65) అనే వృద్ధుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి తీర్థయాత్రకు వచ్చిన ఆయన రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
News March 12, 2026
జగన్ వ్యాఖ్యలు అబద్ధం: పయ్యావుల

AP: జగన్ చేసిన విధ్వంసానికి తాము అప్పుల భారం మోస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్న జగన్ వ్యాఖ్యలు అబద్ధమని కొట్టిపారేశారు. తాము రూ.1.05 లక్షల కోట్లే అప్పు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడా తగ్గలేదని, రెవెన్యూ లోటు ముందు నుంచే ఉందన్నారు. వైసీపీ హయాంలో ఎంత దోపిడీ జరిగిందనేది రేపో, మాపో ఈడీ బయటపెడుతుందని వ్యాఖ్యానించారు.
News March 12, 2026
గ్యాస్ కొరత.. రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా!

గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ఆయిల్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. LPGకి ప్రత్యామ్నాయంగా 40 వేల కిలోలీటర్ల అదనపు కిరోసిన్‌ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది. మరిన్ని కమర్షియల్ సిలిండర్లను రిలీజ్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్ధిదారులకు వాటిని అందజేస్తామని తెలిపింది. హార్ముజ్‌లో 28 భారత నౌకలు సేఫ్‌గా ఉన్నాయని కేంద్రం చెప్పింది. రోజూ 50Lసిలిండర్లు సరఫరా చేస్తున్నామంది.


