News August 4, 2024

ALERT.. 5 రోజులు వర్షాలు

image

తెలంగాణలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3 రోజుల్లో గంటకు 30-40కి.మీ వేగంతో స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఎలాంటి ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు జారీ చేయలేదు.

Similar News

News November 8, 2025

ALERT: పశువులకు ఈ టీకా వేయించారా?

image

తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నారు. ఈ నెల 14 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాను పశువులకు వేయించడంలో పాడి రైతులు నిర్లక్ష్యం చేయొద్దు.✍️ రోజూ సాగు, పాడి సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 8, 2025

పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

image

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.

News November 8, 2025

పిల్లల్లో మల బద్ధకం తగ్గాలంటే..

image

చాలామంది పేరెంట్స్ పిల్లలు ఇష్టంగా తింటున్నారు కదాని బిస్కెట్లు, కార్న్‌ ఫ్లేక్స్‌, నూడుల్స్‌, పెరుగన్నం వంటివి పెడతారు. వీటివల్ల ఆకలి తీరుతుంది కానీ మలబద్ధకం, కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. పిల్లల ఆహారంలో పీచు పదార్థాలు చేర్చాలని సూచిస్తున్నారు. దీనికోసం పొట్టుతో ఉన్న ఓట్స్‌, మిల్లెట్స్‌, గోధుమ పిండి, బెండకాయ, చిక్కుడు, వంకాయ, క్యారెట్‌ ఇస్తే మలబద్ధకం తగ్గుతుందంటున్నారు.