News August 4, 2024

బలగం, దసరాకు అవార్డులు.. సీఎం అభినందనలు

image

TG: కుటుంబ అనుబంధాలను చాటుతూ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ‘బలగం’, ‘దసరా’ చిత్రాలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కించుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డైరెక్టర్ వేణుతో పాటు బలగం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా శ్రీకాంత్ ఓదెల పురస్కారాలు దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈమేరకు సీఎంవో ట్వీట్ చేసింది.

Similar News

News March 15, 2026

KGM: ఏపీటీసీఐఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాయి మనోహర్

image

ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ (APTCIA) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన సాయి మనోహర్ దీవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం తిరుపతి తిరుచానూరులో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. టైప్, కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.

News March 15, 2026

హెల్ప్ చేస్తాం.. కానీ, మాకు డబ్బులు కావాలి: జెలెన్‌స్కీ

image

ఇరాన్‌తో తాము యుద్ధం చేయడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు <<19386678>>జెలెన్‌స్కీ<<>> అన్నారు. షాహెద్ డ్రోన్ల నుంచి పశ్చిమాసియా దేశాలను కాపాడేందుకు రక్షణ కవచంలా మారుతున్నామని తెలిపారు. రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లను కూల్చడంలో ఆరితేరిన ఉక్రెయిన్ ఇప్పుడు ఆ అనుభవాన్ని గల్ఫ్ దేశాలకు పంచుతోంది. దీనికి ప్రతిఫలంగా తమకు టెక్నాలజీ, నిధులు కావాలని జెలెన్‌స్కీ కోరారు. ఇప్పటికే ఖతర్, UAE, సౌదీకి ఎక్స్‌పర్ట్స్‌ను పంపారు.

News March 15, 2026

మోగిన ఎన్నికల నగారా.. ఫుల్ డీటెయిల్స్ ఇవే

image

తమిళనాడు, బెంగాల్, కేరళం, అస్సాం, పుదుచ్చేరి(UT)లో ఎన్నికల నగారా మోగింది. 824 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. బెంగాల్‌లో అత్యధికంగా 294, TN-234, కేరళం-140, అస్సాం-126, పుదుచ్చేరిలో 30 స్థానాలున్నాయి. 17.4 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం 2.19లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 25 లక్షల మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు.