News August 4, 2024

ఏలూరు: నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

image

ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠాసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన ఫణి కుమార్ అనే వ్యక్తికి కొంతమంది ఫోన్ చేసి రూ.10 లక్షలకు రూ.44 లక్షలు ఇస్తానని చెప్పారు. దీంతో ఫణికుమార్ సందేహంతో పోలీసులకి సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి ఒక సెల్‌ఫోన్ , నకిలీ కరెన్సీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News March 15, 2026

ఈనెల 15 నుంచి పశువులకు గాలికుంటు టీకాలు: కలెక్టర్

image

పెదమిరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రచార గోడపత్రికను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆమె తెలిపారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా సిబ్బంది పాల్గొన్నారు.

News March 15, 2026

ప.గో: బండిపై వెళ్తుంటే భార్య గొంతు కోశాడు.. అసలేం జరిగింది?

image

భార్య గొంతు కోసిన భర్తను తణుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం సజ్జాపురానికి చెందిన కరగాని దిల్లేశ్వరి బండిపై వెళ్తుండగా, వెనుక కూర్చున్న భర్త గోవిందు బ్లేడుతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మనస్పర్ధల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం గోవిందును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. తీవ్ర గాయాలైన దిల్లేశ్వరికి చికిత్స అందుతోంది.

News March 15, 2026

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ.. పాల్గొన్న ఏలూరు ఎంపీ!

image

HYD మొయినాబాద్‌లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో శనివారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంలో పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో పార్టీలోని ఒకరు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్న 9 మందిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఉన్నారు. ఆయనకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. రోహిత్ సహా ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది.