News August 4, 2024
మైదుకూరు: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 167 జాతీయ రహదారిపై ఇందిరమ్మ కాలనీ వద్ద ఆర్టీసీ బస్సును బైకు ఢీకొంది. ఈ ఘటనలో దువ్వూరు మండలం నేలటూరుకు చెందిన చందు దుర్మరణం చెందాడు. రాజేశ్ అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. 108లో కడప ఆసుపత్రికి తరలించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వారిద్దరూ స్నేహితులని స్థానికులు తెలిపారు. దీంతో స్నేహితుల దినోత్సవం రోజు ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Similar News
News March 22, 2026
కడపలో టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ పూజలు

టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి శనివారం కుటుంబ సమేతంగా కడపలోని శ్రీ విజయ దుర్గాదేవిని దర్శించుకున్నారు. పదేళ్లుగా ఆమె తల్లి ఈ ఆలయంలో రాహుకేతు పూజలు చేస్తుండగా, శనివారం శ్రీచరణి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు స్వాగతం పలికి, అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు. 2025 మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఆమె కీలక సభ్యురాలు.

News March 21, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.14,800
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,616
*వెండి 10 గ్రాముల ధర రూ.2310