News August 4, 2024

టీమ్ ఇండియాలో ప్రయోగాలు కొనసాగిస్తాం: బౌలింగ్ కోచ్

image

టీమ్ ఇండియా కోచ్‌గా గంభీర్ తన మొదటి సిరీస్‌లోనే ప్రయోగాలకు తెర తీశారు. గిల్, సూర్య, రింకూ వంటి బ్యాటర్లతో బౌలింగ్ చేయించారు. ఇకపైనా ప్రయోగాలు కొనసాగుతాయని భారత బౌలింగ్ కోచ్ బహుతులే వెల్లడించారు. ‘మన బ్యాటర్లలో బౌలింగ్ సత్తా కూడా ఉంది. కానీ దానిపై దృష్టి పెట్టడం లేదంతే. టాప్ ఆర్డర్ బ్యాటర్లు బౌలింగ్ చేయడం జట్టుకు అవసరం. మున్ముందూ వారితో బౌలింగ్ చేయిస్తాం’ అని వెల్లడించారు.

Similar News

News March 10, 2026

అక్రిలిక్ నెయిల్స్‌తో క్యాన్సర్ ముప్పు

image

చేతులు అందంగా కనిపించాలని కొందరు అమ్మాయిలు అక్రిలిక్ నెయిల్స్ పెట్టించుకుంటారు. అయితే వీటిని డ్రై చేయడానికి వాడే ల్యాంపులు UVA కిరణాలను విడుదల చేస్తాయి. ఇవి DNAకి హాని కలిగించి చర్మ క్యాన్సర్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే నెయిల్ సెలూన్‌కి వెళ్లినపుడు సన్‌స్క్రీన్/ UV ప్రొటెక్టెడ్ గ్లౌజెస్ వాడటం, LED ల్యాంపులు (UV కాకుండా) ఉపయోగించే సలూన్‌లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News March 10, 2026

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. లెక్కలు ఇవి

image

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే సభలో హాజరై, ఓటు వేసిన సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది మద్దతు ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న 543 సభ్యుల్లో 273 మంది సపోర్ట్ అవసరం. ప్రస్తుతం INDIA కూటమి బలం సుమారు 234 సీట్లు. విపక్షాలు అన్నీ ఓటు వేసినా NDA మెజారిటీ (293)ని దాటలేవు. దీంతో తీర్మానం వీగిపోయే అవకాశమే ఎక్కువ. స్పీకర్ ఓం బిర్లా తన పదవిలో కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది.

News March 10, 2026

AIIMS ఢిల్లీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

AIIMS ఢిల్లీ 16 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS/BDS/BHMS/BUMS /BAMS, పీజీ(ఎపిడిమాలజీ/పబ్లిక్ హెల్త్/కమ్యూనిటీ మెడిసిన్, సోషల్ సైన్సెస్), BSc(నర్సింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.aiims.edu