News August 4, 2024
విశాఖ రేంజ్లో 35 మంది సీఐలు బదిలీ

విశాఖ రేంజ్ పరిధిలో 35 మంది సీఐలను బదిలీ చేస్తూ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉండడంతో వీరిని మినహాయించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. పోస్టింగులు ఇచ్చిన సీఐలు తక్షణమే విధుల్లో చేరాలని డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News September 1, 2025
విశాఖలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విశాఖపట్నం కలెక్టరేట్లో సోమవారం (సెప్టెంబర్ 01, 2025) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News August 31, 2025
విశాఖ: భవనం పైనుంచి జారిపడి మహిళ మృతి

పెద్ద రుషికొండలో భవనం పైనుంచి జారిపడి మృతి చెందింది. ఆరిలోవ ఉంటున్న చందక సత్యాలు (48) భవన నిర్మాణ కార్మికులరాలిగా పనిచేస్తోంది. ఆదివారం ఆదిత్య అపార్ట్మెంట్ వెనుక ఉన్న భవనంలో మరమ్మతుల పనులకు వెళ్లింది. అక్కడ పని చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి కిందపడడంతో మృతి చెందింది.
News August 31, 2025
విశాఖలో సీఎం పర్యటన.. ఏర్పట్లు పరిశీలించిన జేసీ, సీపీ

సీఎం చంద్రబాబు సెప్టెంబర్ 2న విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదివారం పరిశీలించారు. కోస్టల్ బ్యాటరీ వద్ద గల హెలిపాడ్‌ను చెక్ చేసి అక్కడ చేపట్టవలసిన పనులపై చర్చించారు. అనంతరం నోవాటెల్ వద్ద ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అజిత, ఆర్డీవో శ్రీలేఖ పాల్గొన్నారు.