News August 4, 2024
రేపు కడపలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు రేపు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు 08562- 244437 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. SHARE IT
Similar News
News March 11, 2026
కడప జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు ఎన్నంటే.!

కడప జిల్లాలో గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 5,99,802 ఉన్నాయి. ప్రభుత్వం వీటి రీఫిల్ ధరను రూ.60 పెంచింది. దీంతో జిల్లాలోని కుటుంబాలపై ఒక సిలిండర్ వినియోగానికి రూ.3.59 కోట్లు అదనపు భారం పడింది. జిల్లాలో వాణిజ్య వంట గ్యాస్ కనెక్షన్లు 4,769 ఉన్నాయి. వీటిపై రీఫిల్ ధరను రూ.144 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా చిన్న హోటళ్లు, పానిపూరీ, టీ స్టాళ్లలో డొమస్టిక్ గ్యాస్ వాడుతున్నారు.
News March 11, 2026
ఒంటిమిట్ట: మార్చి 25న పసుపు దంచే కార్యక్రమం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25న ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 27న ప్రారంభం కానున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళల అధిక సంఖ్యలో పాల్గొంటారు.
News March 11, 2026
వైవీయూ విద్యార్థి రేగులపాటి పునీత్ చిత్రానికి అవార్డ్

వైవీయు బీఎఫ్‌ఏ విద్యార్థి రేగులపాటి పునీత్ మెరిట్ అవార్డ్ సాధించారు. తమిళనాడులోని శ్రీ దర్శినికలై కోడం ఆర్ట్ కాలేజీ నిర్వహించిన 21వ జాతీయ స్థాయి చిత్రకళా పోటీలలో పునీత్ ఆక్రిలిక్ రంగుతో గీసిన “గ్రామీణ మహిళ “ చిత్రం ఎంపికయ్యింది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు చెన్నై లలితకళా అకాడమీ ఆర్ట్ గ్యాలరీలో చిత్రాన్ని ప్రదర్శిస్తారని ఫైన్ ఆర్ట్స్ హెడ్ మృత్యుంజయ రావు తెలిపారు.


