News August 4, 2024

VIRAL: అటు హిజాబ్.. ఇటు బికినీ!

image

పారిస్: మహిళల బీచ్ వాలీబాల్ పోటీల్లో ఈజిప్ట్ ప్లేయర్లు హిజాబ్ ధరించి ఆడటం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ఈజిప్ట్ vs స్పెయిన్ మ్యాచ్‌లో ఈజిప్ట్ ప్లేయర్లు హిజాబ్‌, స్పెయిన్ ప్లేయర్లు బికినీ ధరించి ఆడారు. ఈజిప్ట్ ప్లేయర్ల వస్త్రధారణను కొందరు విమర్శించగా మరికొందరు వారికి మద్దతు పలికారు. రెండు భిన్న సంస్కృతులు ఒకే వేదికపైకి రావడం మంచి పరిణామం అని, వారి సంస్కృతిని గౌరవించాలని చెబుతున్నారు. <<-se>>#Olympics2024<<>>

Similar News

News January 27, 2026

బ్రూక్ విధ్వంసం.. 66 బంతుల్లోనే 136 రన్స్

image

శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించారు. 66 బంతుల్లోనే 136* రన్స్ బాదారు. ఇందులో 11 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. తొలి 39 బంతుల్లో 46 పరుగులు చేసిన బ్రూక్.. ఆ తర్వాత 27 బంతుల్లోనే 90 రన్స్ చేశారు. ఇక చివరి 14 బంతుల్లో 51 పరుగులు చేశారు. జో రూట్ 111*, బెతెల్ 65 రన్స్ చేయడంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 357-3 స్కోర్ చేసింది.

News January 27, 2026

మున్సిపల్ ఎన్నికలు.. అభ్యర్థుల ఖర్చు ఇలా

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ అభ్యర్థులకు ₹10L, మున్సిపాలిటీలకు ₹5L వరకు వ్యయ పరిమితిని SEC ఖరారు చేసింది. మున్సిపాలిటీల్లో SC, ST, BC అభ్యర్థులు ₹1,250, ఇతరులు ₹2,500, కార్పొరేషన్లలో SC, ST, BCలు ₹2,500, ఇతరులు ₹5K నామినేషన్ డిపాజిట్ చెల్లించాలి. క్యాస్ట్ సర్టిఫికెట్ జత చేయడం తప్పనిసరి. నామినేషన్‌కు ముందే ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి. అభ్యర్థుల ఖర్చులను ఈ ఖాతా ద్వారానే లెక్కిస్తారు.

News January 27, 2026

AI మ్యాజిక్.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి చేసుకున్నట్లు ఉన్న AI ఫొటోలు వైరలవుతున్నాయి. మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, సమంత, శ్రీలీల, మృణాల్ వంటి స్టార్లు ఈ పెళ్లికి హాజరైనట్లు ఫొటోలో చూపించారు. విజయ్-రష్మిక నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలొస్తున్న తరుణంలో వీరి అభిమానులు ఈ AI ఫొటోలు చూసి ఖుషీ అవుతున్నారు.