News August 4, 2024

ఎమ్మెల్యే సబితతో కేసీఆర్ చర్చలు!

image

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ <<13746535>>వ్యాఖ్యలతో<<>> సబిత ఆవేదనకు గురైన నేపథ్యంలో ఆమెతో కేసీఆర్ మాట్లాడారు. ఈ అంశంలో భవిష్యత్ కార్యాచరణపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. సబిత వెంట ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా ఉన్నారు.

Similar News

News January 15, 2025

ఇవాళ నాన్-వెజ్ తింటున్నారా?

image

సంక్రాంతి వేడుకల్లో నేడు ఆఖరి రోజు కనుమ. ఇవాళ తెలుగు రాష్ట్రాల ప్రజలు మాంసాహారం తినడానికి మొగ్గు చూపుతారు. తెలంగాణలో చాలా మంది నిన్న సంక్రాంతి రోజు సైతం నాన్-వెజ్ లాగించేశారు. ఈ రోజు తెలంగాణతో పాటు ఏపీలో భారీ స్థాయిలో చికెన్, మటన్ కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.210 నుంచి రూ.230 వరకు ఉంది. మటన్ రేటు HYDలో రూ.850పైనే ఉంది. మరి ఇవాళ మీరు నాన్-వెజ్ తింటారా? కామెంట్ చేయండి.

News January 15, 2025

IMDకి నేటితో 150 ఏళ్లు

image

భారత వాతావరణ విభాగం(IMD) నేడు 150వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 1875, జనవరి 15న దీనిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం స్థాపించింది. 1864, 1866, 1871లో తీవ్రమైన విపత్తులు సంభవించడంతో వాతావరణ పరిస్థితులను ముందుగా అంచనా వేసేందుకు దీనిని నెలకొల్పారు. వాతావరణ పరిస్థితుల్ని కచ్చితత్వంతో అంచనా వేయడంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. హిందూ మహా సముద్ర తీరంలోని 13 దేశాలతో పాటు సార్క్ దేశాలకు సేవలందిస్తోంది.

News January 15, 2025

Stock Markets: పాజిటివ్‌గా మొదలవ్వొచ్చు!

image

బెంచ్‌మార్క్ సూచీలు పాజిటివ్‌గా మొదలై రేంజుబౌండ్లో కదలాడే అవకాశం ఉంది. గిఫ్ట్‌నిఫ్టీ 40PTS మేర పెరగడం దీనినే సూచిస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచైతే మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. నేడు విడుదలయ్యే US CIP డేటా కోసం ఇన్వెస్టర్లు ఆత్రుతగా వేచిచూస్తున్నారు. దానిని బట్టే ఫెడ్ వడ్డీరేట్ల కోతపై నిర్ణయం తీసుకుంటుంది. క్రూడ్ ధరలు, బాండ్ యీల్డులు కాస్త కూల్‌ఆఫ్ అయ్యాయి. డాలర్ ఇండెక్స్ మాత్రం పెరుగుతూనే ఉంది.