News August 4, 2024

ఫిలింఫేర్ అవార్డ్స్‌లో మెరిసిన ‘కరీంనగర్’

image

సినీ పరిశ్రమలో ప్రతిభ కనబర్చిన దర్శకులు, నటీనటులకు 2024 ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రదానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దర్శకులు వేణు ఎల్దండి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన బలగం, దసరా సినిమాలకు ఈ అవార్డులు రావడం విశేషం. ఉత్తమ దర్శకులుగా వారు ఈ అవార్డులు అందుకోగా.. ఉత్తమ నటీనటులుగా నాని, కీర్తి సురేశ్‌లకు ఈ అవార్డులు దక్కాయి.

Similar News

News February 10, 2026

జమ్మికుంటలో ఓటుకు రూ.10 వేలు?

image

జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఓటు విలువపై చర్చ వేడెక్కుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ఒక్క ఓటుకు రూ.10 వేలు, 25కిలోల రైస్ బ్యాగ్ అందిస్తున్నారని పట్టణమంతా హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు మహిళా ఓటర్లే లక్ష్యంగా నగదు రూ.5వేలు, వెండి కుంకమ భరణి, చీరలు బహుమతులుగా అందిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక రికార్డు బ్రేక్ చేస్తూ జరిగే మున్సిపల్ ఎన్నికలతో రాత్రికి రాత్రే అభ్యర్థుల భవిష్యత్ మారనుంది.

News February 10, 2026

ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి: కరీంనగర్ కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్పుతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఒకదానిని పోలింగ్ కేంద్రం వద్ద చూపాలని, అర్హులైన వారంతా బాధ్యతగా ఓటు వేయాలని కోరారు.

News February 10, 2026

కరీంనగర్‌లో 23 ప్రత్యేక బృందాలతో నిఘా

image

ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు 23 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ఎన్నికల ఉల్లంఘనలపై ప్రజలు 87126 70744, 87126 70745 నంబర్లకు లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.