News August 4, 2024
అతడు చేసిన పని ఎప్పటికీ మర్చిపోను: కీర్తి సురేశ్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ సందర్భంగా తాను లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోని ఓ సంఘటన గురించి హీరోయిన్ కీర్తి సురేశ్ మీడియాతో చెప్పారు. ‘నా ఫ్యాన్ ఒకరు ఓ రోజు డైరెక్ట్‌గా మా ఇంటికి వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అతడి తీరు చూసి నేను షాకయ్యాను’ అని తెలిపారు. దసరా సినిమాకు గాను ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News March 25, 2026
నేడు గుంటూరుకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు గుంటూరుకు వెళ్లనున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూతురు వివాహానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. వేడుక అనంతరం రేవంత్ హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
News March 25, 2026
వంటగ్యాస్ బుకింగ్.. కొత్త రూల్

సిలిండర్ల కొరత నేపథ్యంలో బుకింగ్ రూల్స్‌ను ఆయిల్ కంపెనీలు మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజుల తర్వాతే రీఫిల్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నాయి. ఇక ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి ఈ గడువు 45 రోజులు కాగా సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత బుక్ చేయాలి. అంతకంటే ముందుగా చేసే బుకింగ్స్‌ను సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది.
News March 25, 2026
కరెంట్ అఫైర్స్

* గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్-2026లో పాకిస్థాన్‌కు తొలి స్థానం
* Income Tax Act 2025పై అవగాహన కోసం ‘PRARAMBH 2026’ ప్రారంభం
* టెక్స్‌టైల్ ఎక్స్‌పోర్ట్స్‌లో 2024-25లో తమిళనాడు టాప్
* అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో లోయలో ఒక కొత్త అడవి కివీ జాతి Actinidia indicaని BSI కనుగొంది.
* ఢిల్లీలో జరిగిన ప్రకృతి-2026లో కార్బన్ ట్రేడింగ్, క్లైమెట్ యాక్షన్ క్రమబద్ధీకరణకు ఇండియన్ కార్బన్ మార్కెట్ పోర్టల్ ఏర్పాటు.


