News August 4, 2024

మార్చి నాటికి దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు : పెమ్మసాని

image

దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా BSNL 4G సేవలు విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం తాడికొండలో 4G టవర్‌ను స్థానిక MLA శ్రవణ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బేస్ బ్యాండ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ.. సెప్టెంబర్ కల్లా 70%, మార్చి లోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామన్నారు.

Similar News

News November 29, 2024

ఈనెల 30న మంగళగిరిలో జాబ్ మేళా

image

ఈనెల 30న మంగళగిరిలోని VJ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 9 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10 నుంచి పీజీ, డిప్లొమా, బీటెక్, ఐఐటీ, ఇంటర్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన వారికి సూమారు రూ.20వేల జీతం ఉంటుందన్నారు.

News November 29, 2024

చేబ్రోలు: బాలికను హత్య చేసిన నిందితుడు అరెస్ట్

image

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న శైలజ(13)ను జులై 15వ తేదీన నాగరాజు అనే వ్యక్తి హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు గత నాలుగు నెలలుగా నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. ఈమేరకు గురువారం నిందితుడిని రాజమండ్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 29, 2024

నేటి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

image

నేటి నుంచి రానున్న 4 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా తెలిపారు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.