News August 4, 2024
MBNR: ‘స్వచ్ఛదనం-పచ్చదనం’.. రేపు చేపట్టాల్సిన పనులు!

రేపటి నుంచి ప్రారంభంకానున్న “స్వచ్ఛదనం-పచ్చదనం” కార్యక్రమంపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈనెల 5న✒ప్రజలకు “స్వచ్ఛదనం-పచ్చదనం” కార్యక్రమంపై అవగాహన✒ప్రభుత్వ కార్యాలయాలు,కూడళ్లు,రోడ్లను శుభ్రం చేయడం✒మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం✒వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకంపై ప్రజలకు అవగాహన✒చెత్త సేకరించి వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ అమలు చేయడం తదితర పనులు చేపట్టనున్నారు.
Similar News
News March 13, 2026
మహబూబ్‌నగర్: ఫలించని జశ్వంత్ ప్రయత్నం

భూత్పూర్ మండలం వెల్కిచర్లలో గురువారం ఓ తల్లి పిల్లలతోకలిసి బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఆమె కుమారుడు జశ్వంత్( 8)వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంపట్ల గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. బాలుడు బావిలోని ఎత్తు ప్రదేశంలో పడటంతో ఒడ్డుకుచేరుకొని వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులకు చెప్పడంతో గాలింపు చేపట్టారు. కానీ అప్పటికే తల్లి, కూతుళ్లు మృతి చెందారు.
News March 12, 2026
MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఈనెల 28వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జడ్జి ప్రేమలత తెలిపారు. రాజీ పడే ప్రతి కేసులను రాజు ద్వారానే పరిష్కారం చేసుకోవాలని రాజీ మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1334 కేసులను గుర్తించామని, అందులో 32 కేసులను పరిష్కారం చేశామని తెలిపారు. సివిల్, కుటుంబం, యాక్సిడెంట్, ఫ్రీ లిటిగేషన్ వంటి కేసులను పరిష్కారం చేసుకోవచ్చన్నారు.
News March 12, 2026
ఏడుకొండల కురుమూర్తి స్వామి దేవాలయానికి ముప్పు

పేదల తిరుపతిగా పేరుగాంచిన ఏడుకొండల కురుమూర్తి స్వామి దేవాలయానికి రానున్న కాలంలో ముప్పు తలపించే అవకాశం ఉందని దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా తుతుమంత్రంగా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించారని అన్నారు. మొత్తానికి దేవాలయం పరిసర ప్రాంతాలలో క్రషర్ మిషన్ కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ ఉండే ఏడుకొండలను తవ్వాలని ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.


