News August 4, 2024

రాజన్న ఆలయంలో రేపటి నుంచి బ్రేక్ దర్శనాలు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి బ్రేక్ దర్శనాలను ఈనెల 5 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు రెండు సార్లు ఉ.10:15 నుంచి 11:15 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయని, ఒక్కొ టికెట్‌పై రూ.300 ఛార్జీ, ఒక లడ్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 24, 2026

పారదర్శకమైన ఓటరు జాబితాకు సహకరించండి: కలెక్టర్ చిత్రా మిశ్రా

image

ఓటరు జాబితాలో అక్రమాలను తొలగించి, పారదర్శకత పెంచేందుకే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల తొలగింపుపై అపోహలు వద్దన్నారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకుని ఈ ప్రక్రియకు సహకరించాలని కోరారు.

News March 24, 2026

నిబంధనల మేరకే గ్యాస్ సరఫరా జరగాలి: కలెక్టర్

image

గ్యాస్ సరఫరాలో నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హెచ్చరించారు. సీతారాంపూర్‌లోని భారత్ గ్యాస్ గోదామును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

News March 24, 2026

సైదాపూర్: తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

image

సైదాపూర్ మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు తాటిచెట్టుపై నుంచి కిందపడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన ఆకుల వేణు ఉదయం తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడడంతో వెన్నుపూసతో పాటు, పలు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.