News August 4, 2024
ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి

పారిస్ ఒలింపిక్స్‌లో బ్రిటిష్ అథ్లెట్ హెన్రీ ఫీల్డ్‌మాన్ చరిత్ర సృష్టించారు. మెన్స్, ఉమెన్స్ ఈవెంట్‌లో మెడల్ గెలిచిన తొలి అథ్లెట్‌గా నిలిచారు. 2021 ఒలింపిక్స్‌లో మెన్స్ 8 రోయింగ్ టీమ్‌తో కాంస్య పతకం గెలిచిన అతను, పారిస్ ఒలింపిక్స్‌లో ఉమెన్స్ 8 టీమ్‌తో కలిసి కాంస్యం సాధించారు. 2017లో సవరించిన రూల్స్ ప్రకారం 8 పర్సన్ రోయింగ్ ఈవెంట్‌లో కాక్స్‌వైన్(బోటు నడిపే వ్యక్తి) ఏ జెండర్ వారైనా ఉండవచ్చు.
Similar News
News March 10, 2026
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. లెక్కలు ఇవి

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే సభలో హాజరై, ఓటు వేసిన సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది మద్దతు ఉండాలి. అంటే ప్రస్తుతం ఉన్న 543 సభ్యుల్లో 273 మంది సపోర్ట్ అవసరం. ప్రస్తుతం INDIA కూటమి బలం సుమారు 234 సీట్లు. విపక్షాలు అన్నీ ఓటు వేసినా NDA మెజారిటీ (293)ని దాటలేవు. దీంతో తీర్మానం వీగిపోయే అవకాశమే ఎక్కువ. స్పీకర్ ఓం బిర్లా తన పదవిలో కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉంది.
News March 10, 2026
AIIMS ఢిల్లీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

AIIMS ఢిల్లీ 16 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS/BDS/BHMS/BUMS /BAMS, పీజీ(ఎపిడిమాలజీ/పబ్లిక్ హెల్త్/కమ్యూనిటీ మెడిసిన్, సోషల్ సైన్సెస్), BSc(నర్సింగ్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.aiims.edu
News March 10, 2026
నిద్రపోతున్న హనుమంతుడు.. పాదాల చెంత శనిదేవుడు!

MH లోనార్‌లో ‘మోతా మారుతి’ ఆలయం అతి పవిత్రమైనది, అరుదైనది. ఇక్కడ హనుమంతుడు భారీ పరిమాణంలో దర్శనమిస్తారు. శయన రూపంలో ఉండటం విశేషం. ఈ విగ్రహం అయస్కాంత శక్తి కలిగిన శిలతో తయారైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాక్షాత్తూ శనిదేవుడే ఇక్కడ స్వామివారి పాదాల చెంత సేవకుడిగా ఉంటాడని నమ్ముతారు. ఇక్కడ కొలువైన హనుమంతుడిని ఏలినాటి, సమస్త శని దోషాలు పోతాయని ప్రతీతి. ఆధ్యాత్మికత, అద్భుత శిల్పకళకు ఈ గుడి నిలయం!


