News August 4, 2024
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన భారత ఓపెనర్‌గా సచిన్(120) పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ(121) బ్రేక్ చేశారు. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనతను అందుకున్నారు. అలాగే వన్డేల్లో తొలి పది ఓవర్లలోపు అత్యధిక ఫిఫ్టీలు కొట్టిన భారత బ్యాటర్ల లిస్టులో హిట్‌మ్యాన్(4) రెండో స్థానంలో ఉన్నారు. సెహ్వాగ్(7) తొలి స్థానంలో కొనసాగుతున్నారు.
Similar News
News March 10, 2026
వాళ్ల ఒత్తిడితోనే వెనక్కి తగ్గిన ట్రంప్?

ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనమైందని ట్రంప్ చెబుతున్నా.. యుద్ధం ముగింపునకు వచ్చిందన్న ప్రకటన వెనక ఆయన అడ్వైజర్ల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్ ధరలు పెరగడం, US ప్రజల మద్దతు లేకపోవడం, ఇరాన్ తగ్గే సూచనలు కనిపించకపోవడం, మిడ్ టర్మ్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్లు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఎక్కడ డెమోక్రాట్లకు ప్లస్ అవుతుందోనన్న భయం ఉన్నట్లు సమాచారం.
News March 10, 2026
ఎల్ నినో.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: వీసీ

AP: ఈ ఏడాది ఏప్రిల్ వరకు ENSO(ఎల్ నినో+లా నినా) పరిస్థితులకు అవకాశం ఉందని ఎన్జీ రంగా వర్సిటీ వీసీ జయలక్ష్మీ దేవి వెల్లడించారు. జులై తర్వాత <<19250011>>ఎల్ నినోకు<<>> 60 శాతం ఛాన్స్ ఉందని తెలిపారు. దీనివల్ల నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని సూచించారు. నష్టాలను నివారించడానికి వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలన్నారు.
News March 10, 2026
1,900 మంది ఇరాన్ సైనికులను చంపేశాం: ఇజ్రాయెల్

యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 1,900 మంది ఇరాన్ సైనికులు, కమాండర్లను చంపేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. కొత్త సుప్రీం లీడర్‌నూ టార్గెట్ చేసే అంశాన్ని కొట్టిపారేయలేమని స్పష్టం చేసింది. ఇక ఇరాన్, హెజ్బొల్లా దాడుల్లో ఇజ్రాయెల్‌లో 12 మంది పౌరులు, ఇద్దరు జవాన్లు మరణించినట్లు తెలిపింది. గాయపడిన వారిలో 2,238 మంది ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని, 91 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది.


