News August 5, 2024

NLGలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థ: మంత్రి కోమటిరెడ్డి

image

చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకుగాను NLGలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

Similar News

News March 21, 2026

NLG: ముగింపు దశలో మొలకెత్తిన ఆశ!

image

జిల్లాలోని అన్నదాతల నిరీక్షణకు తెరపడనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధులు రేపటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. యాసంగి సీజన్ ముగింపు దశకు వస్తున్న తరుణంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జిల్లాలో ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. సాగు కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట కలగనుంది.

News March 21, 2026

నల్గొండ జీజీహెచ్‌లో వేధింపుల కలకలం..!

image

నల్గొండ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్షణ కరువైంది. ఎక్స్‌రే విభాగంలో శిక్షణ పొందుతున్న ఓ పారామెడికల్ విద్యార్థినిపై అక్కడే అవుట్‌సోర్సింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు తెగబడుతున్నాడు. నిందితుడి వేధింపులు మితిమీరడంతో భరించలేకపోయిన బాధితురాలు శనివారం ‘డయల్ 100’కు ఫిర్యాదు చేసింది.

News March 21, 2026

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

image

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు 30 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కఠోర దీక్షలు, ప్రార్థనలు చేశారని ఆయన పేర్కొన్నారు. అల్లా దయతో వారందరి జీవితాల్లో సంతోషం, వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ఆయన ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.