News August 5, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో ఎం.ఫార్మసీ, బీ.ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించే సప్లిమెంటరీ(One time Opportunity) పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఆయా కోర్సుల విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్సిటీ సూచించింది. పూర్తి వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని స్పష్టం చేసింది.

Similar News

News January 10, 2026

కృష్ణా జిల్లాలో ఎస్ఐల బదిలీ

image

ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ శాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త టీమ్‌ను తయారు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా భారీగా ఎస్ఐలను బదిలీ చేశారు. మొత్తం 38 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగ వేళ జరిగిన ఈ బదిలీలు జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి.

News January 10, 2026

కృష్ణా: కోడలి ప్రాణం తీయబోయిన మామ.. న్యాయస్థానం సీరియస్

image

కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. రెండు రోజుల కిందట ఆకూరి నాగశ్వేతపై ఆమె మామ కత్తితో దాడి తీసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కలిదిండి సోమరాజును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు చిలకలపూడి సీఐ నబీ తెలిపారు.

News January 10, 2026

బందరులో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన మామకు రిమాండ్