News August 5, 2024

శ్రీకాకుళం: జీతాలు అందక ఒప్పంద అధ్యాపకుల అవస్థలు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 45 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వాటిల్లో 370 మంది ఒప్పంద అధ్యాపకులు సేవలందిస్తున్నారు. వీరి సేవలను పునరుద్ధరించని కారణంగా మే నెల నుంచి జీతాలు చెల్లింపులు జరగలేదు. సకాలంలో జీతాలు అందక ఇబ్బందిగా ఉంటోందని, కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. మే నెలలో వేసవి సెలవులు అయినప్పటికీ ఎన్నికల విధులు, పరీక్షలు తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించామన్నారు.

Similar News

News March 20, 2026

SKLM: రేపు టెన్త్ పరీక్ష వాయిదా

image

రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా ప్రభుత్వం శనివారం (మార్చి 21) సెలవు ప్రకటించింది. ఆ రోజు జరగాల్సిన పదో తరగతి, ఓపెన్ స్కూల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి. రవిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 21న జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన, ఓపెన్ స్కూల్ గణితం, భారతీయ సంస్కృతి పరీక్షలు 30వ తేదీన జరుగుతాయన్నారు.

News March 20, 2026

మందస: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

మందస మండలంలోని కొర్రాయి గేటు వద్ద తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..సోంపేట నుంచి కాశీబుగ్గ వైపునకు వస్తున్న యువకుడు బైక్ అదుపు తప్పి పక్కన రక్షణ ఇనుమును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మందస ఎస్సై కృష్ణ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్‌ బాడీని పోస్టుమార్టానికి హరిపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

News March 20, 2026

‘అర్జీలను సత్వరం పరిష్కరించాలి’: శ్రీకాకుళం కలెక్టర్

image

దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్‌ను కలెక్టర్ దివ్యాంగుల సంక్షేమశాఖ, ఏడీబీ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రీవెన్స్‌లో 7 దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.