News August 5, 2024

టీటీసీ లోయర్ థియరీ పరీక్షలు ప్రశాంతం: డీఈఓ భిక్షపతి

image

నల్గొండలో ఆదివారం నిర్వహించిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. పట్టణంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పేపర్-2 మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్-3 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తం 362 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ తెలిపారు.

Similar News

News March 20, 2026

నల్గొండ: కాయ కాచినా.. కష్టం తీరలేదు

image

వేసవి వచ్చిందంటే బత్తాయి రైతు ఇంట సిరులు కురవాలి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఇటు పక్కనేమో పండుగలు, అటు సరిహద్దుల్లో యుద్ధాలు.. వెరసి బత్తాయి తోటల్లో కోతలు ఆగిపోయి రైతు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సరిహద్దుల్లో యుద్ధం వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పండ్ల ఎగుమతి, దిగుమతుల చైన్ పూర్తిగా దెబ్బతిందని రైతులు పేర్కొంటున్నారు. మరోవైపు లారీల కిరాయిలు 10 శాతం మేర పెరిగినట్లు తెలిపారు.

News March 20, 2026

నల్గొండ: 400 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

image

యాసంగి వరి కోతలు ప్రారంభం కావడంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి 14 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు, గతంలో ఉన్న 375 కేంద్రాలను 400కు పెంచాలని నిర్ణయించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. అధికారుల కసరత్తుతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

News March 20, 2026

నల్గొండ కేవీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

నల్గొండ పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతి, బాలవాటిక-3లో చేరేందుకు ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. అలాగే 2 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీల ఆధారంగా ఏప్రిల్ 2 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తి గల తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.