News August 5, 2024

వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డును పునరుద్ధరణకు కృషి: గవర్నర్

image

వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డును పునరుద్ధరించాలన్న ఐజేయూ(ఇండియన్ జర్నలిస్టు యూనియన్) డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. హర్యానాలోని పంచకులలో ఆగస్టు 3, 4వ తేదీల్లో జరిగిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల ముగింపు సెషన్‌కు ఆదివారం చీఫ్ గెస్టుగా హాజరైన గవర్నర్ బండారు దత్తాత్రేయ భరోసా కల్పించారు.

Similar News

News March 16, 2026

HYD: రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

image

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు HYD కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
# SHARE IT

News March 16, 2026

HYD బిర్యానీ హోటళ్లలో భారీ పన్ను ఎగవేత

image

HYDలోని ప్రముఖ బిర్యానీ హోటళ్లలో జరుగుతున్న భారీ పన్ను ఎగవేత వెనుక గుండె తరుక్కుపోయే నిజాలు వెలుగుచూశాయి. యజమానులు కేవలం సాఫ్ట్‌వేర్‌తో బిల్లులు డిలీట్ చేయడమే కాకుండా LPG గ్యాస్ సిలిండర్ల మార్పిడి పేరుతో దోపిడీకి పాల్పడ్డారు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన పన్నును ప్రభుత్వానికి కట్టలేదు. సామాన్యుడి సొమ్మును సాఫ్ట్‌వేర్ ముసుగులో మింగేస్తున్న ఈ దోపిడీదారులు ఇప్పుడు చట్టం ఉచ్చులో చిక్కుకున్నారు.

News March 16, 2026

ఆస్తి పన్ను బకాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?

image

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్ టైమ్ స్కీమ్’ (OTS) ద్వారా బకాయిలపై 90% వడ్డీ మాఫీని పొందే సువర్ణ అవకాశం ఇది. ఇప్పటివరకు GHMC, CMC, MMC పరిధిలో 2.67 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుని, రూ. 52.08 కోట్ల వడ్డీని ఆదా చేసుకున్నారు. ఇప్పటికే 1.64 లక్షల నోటీసులు జారీ అయ్యాయి. జప్తు వారెంట్ల వంటి కఠిన చర్యలకు గురికాకుండా, వెంటనే మీ పన్ను బకాయిలను చెల్లించి భారీగా ఆదా చేసుకోండి!