News August 5, 2024
వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డును పునరుద్ధరణకు కృషి: గవర్నర్

వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డును పునరుద్ధరించాలన్న ఐజేయూ(ఇండియన్ జర్నలిస్టు యూనియన్) డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. హర్యానాలోని పంచకులలో ఆగస్టు 3, 4వ తేదీల్లో జరిగిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల ముగింపు సెషన్‌కు ఆదివారం చీఫ్ గెస్టుగా హాజరైన గవర్నర్ బండారు దత్తాత్రేయ భరోసా కల్పించారు.
Similar News
News March 17, 2026
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పిల్లల దత్తత!

RR జిల్లా కలెక్టరేట్‌లో పిల్లల దత్తత కార్యక్రమం జరిగింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దంపతులు CARA పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసి 3.5 ఏళ్ల తర్వాత పిల్లలను దత్తత తీసుకున్నారు. గత నెల రోజులుగా ఫాస్టర్ కేర్ కింద పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఉండగా అనుబంధం సరిగ్గా ఉండడంతో కలెక్టర్ వద్ద ఫైనల్ దత్తత పత్రాలు అందుకున్నారని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు.
News March 16, 2026
రంగారెడ్డిలో రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు RR కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని SC కార్పొరేషన్ ED పద్మావతి సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
# SHARE IT
News March 14, 2026
పది పరీక్షలకు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు: రంగారెడ్డి DEO

పదోతరగతి పరీక్షలకు ఉదయం 9:35 తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని రంగారెడ్డి జిల్లా డీఈఓ సుశీందర్ రావు అన్నారు. ప్రతి సెంటర్‌ను ఒక సిట్టింగ్ స్క్వాడ్ సహా జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులతో పది ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. చూచిరాతలు, చీటీలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు తెలిపారు.


